దీవిలో ..దిమ్మతిరిగే ఫ్యూచరిస్టిక్ హోటల్

దీవిలో ..దిమ్మతిరిగే ఫ్యూచరిస్టిక్  హోటల్

విలాస వంతమైన స్టార్ హోటళ్లు పెద్ద పెద్ద నగరాల్లో ఉంటాయి. కానీ అసలు ఏ మాత్రం జనావాసాలు లేని దీవిలో ఇప్పుడు ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ హోటల్ రానుంది. అది కూడా 2024 సంవత్సరంలోనే అందుబాటులోకి వస్తోంది. . దీనికి సంబదించిన పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. ఈ అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ హోటల్ ఫోటోలను ఇటీవల విడుదల చేశారు. ఇంతకీ ఇది ఎక్కడ అంటారా. సౌదీ అరేబియా లోని శయబారా ద్వీపంలో రానుంది. రెడ్ సీ గ్లోబల్ నిర్మించే ఈ రిసార్ట్ పేరు కూడా సయభారా రిసార్ట్ గా పెట్టారు. ఈ ద్వీపం ఎంతో విభిన్నమైన వాతావరణం కలిగి ఉంటుంది. మడ అడవులు, తెల్లటి ఇసుక, ప్రపంచంలోని అత్యంత సహజమైన పగడపు దిబ్బలు ఈ ప్రాంతపు ప్రత్యేకతలు. కిల్లా డిజైన్ అనే సంస్థ డిజైన్ చేసిన ఈ ఫ్యూచరిస్టిక్ హోటల్ కు చేరుకోవాలంటే సౌదీ అరేబియా నుంచి బోట్ లో 45 నిమిషాలపాటు ప్రయాణించాల్సి ఉంటుంది.

బాల్ ఆకారంలో ఉండే ఈ ఫ్యూచరిస్టిక్ హోటల్ గదులు నీటిపై తేలియాడుతూ అటు ఆకాశం, ఇటు సముద్రం కనిపించేలా ఉంటాయి. అంతే కాదు...నీళ్ల కింద ఉన్న పగడపు దిబ్బలు కూడా అందులో ఉన్నవారికి కనిపిస్తాయి. సయభారా రిసార్ట్ అత్యంత విలాసవంతమైన 73 గదులతో అందుబాటులోకి రానుంది. ఈ రిసార్ట్ సొంతంగానే సోలార్ పవర్ సమకూర్చుకోనుంది. బోట్ లేదా సీ ప్లేన్ ద్వారా కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను ఇది విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బస చేయాలంటే అది అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఉండటం ఖాయం.

Similar Posts

Recent Posts

International

Share it