జనవరి నుంచి వ్యాపార ప్రయాణికులకు సింగపూర్ అనుమతి

జనవరి నుంచి వ్యాపార ప్రయాణికులకు సింగపూర్ అనుమతి

సింగపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి నుంచి దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించనుంది. తొలి దశలో పరిమిత సంఖ్యలోనే వ్యాపార, అధికారులను మాత్రమే అనుమతించనుంది. అన్ని దేశాల వారిని దేశంలోకి అనుమతించనున్నారు. రవాణా, ఆతిథ్య రంగాలను గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది సింగపూర్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశం జరగనుంది. దీని కోసం బలియన్ల కొద్దీ డాలర్లను వ్యయం చేసింది ఆ దేశం. విదేశాల నుంచి వచ్చే వ్యాపారవేత్తలు, ఇతరుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రయాణికులకు అత్యంత కఠినమైన పరిశీలన ప్రోటోకాల్స్ అమలు చేయనున్నారు. ఇప్పటికే కరోనా ప్రభావంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందుకు సింగపూరేమీ అతీతం కాదు.

ఈ నేపథ్యంలోనే తాజాగా అంతర్జాతీయ వ్యాపార ప్రయాణికులను దేశంలోకి ప్రవేశించడాన్ని అనుమతి ఇచ్చింది. తమ దేశానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా బోర్డింగ్‌కు ముందే కొవిడ్ టెస్టు చేయించుకుని, దాని తాలూకు నెగెటివ్ సర్టిఫికేట్‌తో రావాలని సంబంధిత అధికారులు వెల్లడించారు. అది కూడా ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే వ్యాపారులు తమ సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. అలాగే స్టే చేయాల్సిన నివాస ప్రాంగణాలను కూడా అధికారులు ముందుగానే కేటాయిస్తారట. ఈ నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. పర్యాటకులను అనుమతించేందుకు మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తొలి దశ కింద వ్యాపారవేత్తలను అనుమతిస్తున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it