వరల్డ్స్ టాప్ ట్వంటీ ఎయిర్ పోర్ట్స్

వరల్డ్స్ టాప్ ట్వంటీ ఎయిర్ పోర్ట్స్

స్కై ట్రాక్స్ మరోసారి ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా విడుదల చేసింది. లండన్ కు చెందిన ఈ సంస్థ ప్రతి ఏటా ప్రపంచంలోని బెస్ట్ ఎయిర్ లైన్స్ తో పాటు ఎయిర్ పోర్ట్స్ జాబితా కూడా విడుదల చేస్తుంది. ప్రయాణికుల నుంచి పూర్తి స్థాయి సమాచారం తీసుకుని ఈ జాబితా రూపొందిస్తుంది. 2023 సంవత్సరానికి గాను స్కై ట్రాక్స్ వరల్డ్ టాప్ ట్వంటీ విమానాశ్రయాల జాబితాను విడుదల చేసింది. టాప్ టెన్ లో అగ్ర రాజ్యం అమెరికా కు చెందిన విమానాశ్రయం ఒక్కటి లేక పోగా...టాప్ ట్వంటీ లో భారత్ కు చెందిన ఒక్క విమానాశ్రయానికి చోటు దక్కలేదు. తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయం వరల్డ్స్ నెంబర్ వన్ ఎయిర్ పోర్ట్ గా నిలిచింది. వాస్తవానికి గతంలో ఈ ఎయిర్ పోర్ట్ వరసగా చాలా సంవత్సరాలు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా...కరోనా కారణంగా రెండేళ్లు ఈ ప్లేస్ ను కోల్పోయింది.

తిరిగి ఇప్పుడు టాప్ పొజిషన్ కు చేరింది. చాంగీలో అత్యుత్తమ పరిశుభ్రత, సిబ్బంది ప్రవర్తన, ఆధునిక సదుపాయాలు అన్నింటిపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేసి మంచి రేటింగ్ ఇచ్చారు. టాప్ 20లో జపాన్ ఏకంగా 4 ర్యాంకులు కొట్టేసి సింహభాగం ఆక్రమించింది. న్యూయార్క్ ఎయిర్ పోర్టు 88 స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్ట్, శుభ్రమైన ఎయిర్ పోర్ట్ గా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నిలిచింది. టాప్ 100 జాబితాలో ఢిల్లీకి 36, శంషాబాద్‌కి 65, బెంగళూరుకు 69, ముంబైకి 84వ ర్యాంకు దక్కాయి. స్కైట్రాక్ జాబితా ప్రకారం ప్రపంచంలోని టాప్ ట్వంటీ విమానాశ్రయాల జాబితా ఇలా ఉంది.

1. చాంగి (సింగపూర్)

2. హమద్ (దోహా, ఖతర్)

3. హనీదా (టోక్యో, జపాన్)

4. ఇన్చెయాన్ (సియోల్, ద. కొరియా)

5. చాల్స్ డి గాల్ (పారిస్, ఫ్రాన్స్)

6. ఇస్తాంబుల్ (తుర్కియే)

7. మ్యూనిక్ (జర్మనీ)

8. జ్యూరిక్ (స్విట్జర్లాండ్)

9. నరీటా (టోక్యో, జపాన్)

10 బరాజస్ (మాడ్రిడ్, స్పెయిన్)

11. వియన్నా (ఆస్ట్రియా)

12. వాంటా (ఫిన్లాండ్)

13. ఫ్యూమిసినా (రోమ్, ఇటలీ).

14. కోపెన్ హాగెన్ (డెన్మార్క్)

15. కాన్సాయ్ (జపాన్)

16. సెంట్రైన్ నయోగా (జపాన్)

17. దుబాయ్

18. టకోమా (సియాటెల్),

19. మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా)

20. వాంకోవర్ (కెనడా)

Similar Posts

Recent Posts

International

Share it