గోవాలో కూల్ బీచ్ లు అన్నీ అక్కడే

గోవా అంటే గుర్తొచ్చేది బీచ్ లే. అయితే గోవాలో ఉత్తర గోవా, దక్షిణ గోవా రెండు ఉంటాయి. ఉత్తర గోవా బీచ్ లు నిత్యం జన సందడితో కళకళలాడుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గోవాలో హంగామా అంతా అక్కడే ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ప్రత్యేకంగా దక్షిణ గోవా గురించి చెప్పుకుంటున్నాం. దక్షిణ గోవా బీచ్ లు ప్రశాంతతకు మారు పేరు. ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణ గోవా బీచ్ లను ఎక్కువగా ప్రేమికులే ఎంచుకుంటారు. అంతే కాదు రిలాక్స్ గా పార్టీలు చేసుకునే వారు కూడా ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతారు. దక్షిణ గోవాలోని ముఖ్యమైన బీచ్ ల వివరాలపై ఓ లుక్కేయండి.

1. కోలా బీచ్

ఈ బీచ్ కు సీక్రెట్ బీచ్ అనే పేరు ఉంది. దీనికి కారణం ఇది రెండు కొండల మధ్య ఉండటమే. ఇక్కడి బీచ్ లో నీళ్ళు క్లీన్ గా ఉంటాయి. అందుకే ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అగోండా బీచ్ నుంచి ఈ బీచ్ కు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. ఇసుక తిన్నెలపై ఎంజాయ్ చేయటంతోపాటు బీచ్ లో ఎండలో సేద తీరాలనుకునే వారికి ఇది అనువైన ప్రాంతం. అంతే కాదు..ఇది స్విమ్మింగ్ కు కూడా అనువైన ప్రాంతంగా చెబుతారు.

2.కాబో డీ రామా

దక్షిణ గోవాలో ఇది ఓ ఒంటరి బీచ్. స్థానికులు మాత్రం రాష్ట్రంలోనే ఇది అత్యంత సుందరమైన బీచ్ గా చెబుతారు. కొండల మధ్య ఈ బీచ్ ఉంటుంది. స్థానికులకు ఇది ఫేవరేట్ బీచ్. అంతే కాదు పిక్నిక్ లకు ఇది ప్రత్యేక ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ పక్కన దాక్కున్న ప్రాంతం వంటిది ఇది. కాబో డీ రామా ఫోర్ట్ కు దగ్గరలోనే ఈ బీచ్ ఉంటుంది. పర్యాటకులు ఖచ్చితంగా చూడదగ్గ బీచ్ ల్లో ఇది ఒకటి.

3. అగోండా బీచ్

లగ్జరీ నివాస ప్రాంతాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే బీచ్ ల్లో అగోండా బీచ్ ఒకటి. స్విమ్మింగ్ కు కూడా అనువైన ప్రాంతం. బీచ్ హట్స్ ఇక్కడ ఉండాలనుకునే వారికి ఎంతో అనువుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో సరదా కొనుగోళ్ళకు, బీచ్ రెస్టారెంట్లకు ఫేమస్. ఆకర్షించే ప్రాంతాలు ఈ ప్రాంతం సొంతం.

4. బట్టర్ ఫ్లై బీచ్

ఎంతో ఆనందాన్ని కలిగించే ప్రాంతం ఇది. చిన్న ఇసుక తిన్నెలతో కూడిన ఈ ప్రాంతానికి పీక్ సీజన్ లోనూ అతి తక్కువ మంది పర్యాటకులు సందర్శిస్తారు. అగోండా ప్రాంతం నుంచి బోట్ ద్వారానే ఈ ప్రాంతానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఫుడ్ ప్యాక్ చేసుకుని వెళ్ళి పిక్నిక్ కు వెళ్ళేందుకు ఇది ఎంతో అనువైన ప్రాంతం.

5. పాలోలెమ్ బీచ్

తెల్లటి ఇసుక తిన్నెలతో కూడిన బీచ్. పర్యాటకులకు అనువైన నివాస ప్రాంతాలు..రెస్టారెంట్లు. దక్షిణ గోవాలోని అందమైన బీచ్ ల్లో పాలోలెమ్ బీచ్ ఒకటి. పార్టీలు చేసుకునేందుకు ఇది అనువైన ప్రాంతం. ఇక్కడ నిత్యం పార్టీలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ బీచ్ లు దక్షిణ గోవాలో ముఖ్యమైనవి. వీటితోపాటు మరికొన్ని బీచ్ లు కూడా ఉన్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it