రస్ అల్ ఖైమా కు స్పైస్ జెట్ విమాన సర్వీసులు

రస్ అల్ ఖైమా కు స్పైస్ జెట్ విమాన సర్వీసులు

దేశంలోని ప్రముఖ చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ రస్ అల్ ఖైమాకు విమాన సర్వీసులు ప్రారంభిస్తోంది. దీంతో ఈ ఎయిర్ లైన్స్ నడిపే అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య 12కి పెరిగింది. నవంబర్ 26 న ఢిల్లీ నుంచి రస్ అల్ ఖైమాకు ఈ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. యూఏఈలో రస్ అల్ ఖైమా నాల్గవ అతి పెద్ద ఎమిరేట్ అని..దుబాయ్ నుంచి 90 నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతానికి చేరుకోవచ్చని స్పైస్ జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు.

ఎంతో మెరుగైన మౌలికసదుపాయాలు, ఓడరేవులతో సులభంగా అనుసంధానం , అంతర్జాతీయ విమానాశ్రయాలు వంటి వాటితో పెట్టుబడులకు రస్ అల్ ఖైమా ఎంతో అనువైన ప్రాంతం అని పేర్కొన్నారు. రస్ అల్ ఖైమాతోపాటు స్పైస్ జెట్ కొత్తగా 12 కొత్త దేశీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విమానయాన సంస్థ రోజూ 61 ఉడాన్ ఫ్లైట్స్ నడుపుతోంది.

Similar Posts

Recent Posts

International

Share it