స్పైస్ జెట్ కొత్తగా 30 సర్వీసులు

స్పైస్ జెట్ కొత్తగా 30 సర్వీసులు

దేశంలోని ప్రముఖ చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కొత్తగా 30 సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అందులో హైదరాబాద్-గోవా, హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-దర్భంగా సర్వీసులు కూడా ఉన్నాయి. హైదరాబాద్-విశాఖపట్నం సర్వీసు హైదరాబాద్ లో ఉదయం 10.50 గంటలకు బయలుదేరి 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది. ఈ సర్వీసులు డిసెంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్-గోవా సర్వీసు 20.20 హైదరాబాద్ నుంచి బయలుదేరి 21.40కి గోవా చేరుకోనుంది. ఈ కొత్త సర్వీసులు కూడా డిసెంబర్ 25 నుంచే అందుబాటులోకి వస్తాయని స్పైస్ జెట్ ఒక ప్రకటనలో తెలిపింది.

పలు రూట్లలో కనెక్టివిటిని పెంచేందుకు చర్యలు చేపట్టింది. కొత్తగా చేపట్టనున్న సర్వీసుల్లో బోయింగ్ 737 తోపాటు బొంబార్డియర్ క్యూ 400 ఎయిర్ క్రాఫ్ట్ లను ఉపయోగించనుంది. పలు మార్గాల్లో దేశీయ సర్వీసుల సంఖ్యను పెంచటం సంతోషంగా ఉందని స్పైస్ జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు. కొత్త సర్వీసుల ప్రారంభం సందర్భంగా ప్రమోషనల్ ఆఫర్ కింద పలు రూట్లలో స్పైస్ జెట్ తక్కువ ధరకే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్-విశాఖపట్నం టిక్కెట్ ధరను 3146 రూపాయలుగా. హైదరాబాద్-గోవా టిక్కెట్ ధర3145గా నిర్ణయించారు.

Similar Posts

Recent Posts

International

Share it