స్పైస్ జెట్ మెగా మాన్ సూన్ సేల్

స్పైస్ జెట్ మెగా మాన్ సూన్ సేల్

దేశంలోని ప్ర‌ముఖ చౌక‌ధ‌ర‌ల ఎయిర్ లైన్స్ కొత్త ఆఫ‌ర్ తో ముందుకొచ్చింది. మెగా మాన్ సూన్ సేల్ పేరుతో దేశీయ విమాన‌ టిక్కెట్ల‌ను 999 రూపాయ‌ల‌కే విక్ర‌యిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ఆఫ‌ర్ కింద బుకింగ్స్ జూన్ 25 నుంచి 30 వ‌ర‌కూ కొన‌సాగ‌నున్నాయి. ఈ ఆఫ‌ర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు 2021ఆగ‌స్టు నుంచి 2022 మార్చి31లోగా ఎప్పుడైనా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. 149 రూపాయ‌ల అద‌నంగా చెల్లించ‌టం ద్వారా న‌చ్చిన సీట్లు బుక్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. స్పైస్ జెట్ వెబ్ సైట్ తోపాటు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ప‌లు ఇత‌ర ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపింది. ఢిల్లీతోపాటు క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ల్లో ఎలాంటి క్వారంటైన్ తోపాటు ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ లు కూడా అవ‌స‌రంలేద‌ని స్పైస్ జెట్ వెల్ల‌డించింది.

Similar Posts

Recent Posts

International

Share it