పెళ్లిళ్లకు 'అద్దె విమానాలు' రెడీ

పెళ్లిళ్లకు అద్దె విమానాలు రెడీ

డబ్బుంటే ప్రైవేట్ జెట్ లు బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చి చాలా కాలమే అయింది. అయితే ఈ ప్రైవేట్ జెట్స్ లో సీట్లు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. కొన్నింటిలో పది నుంచి పదిహేను..మరికొన్నింటిలో ఎక్కువ సీట్లు ఉంటాయి. అయితే దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ 'స్పైస్ జెట్ ' మాత్రం పెళ్ళిళ్ళకు విమానాలు బుక్ చేసుకోమని ఆఫర్ ఇస్తోంది. అది బీచ్ పక్కన పెళ్ళి అయినా..ఎంత భారీ పెళ్లి అయినా సరే మీ అవసరాలు మేం తీరుస్తామంటూ చెబుతోంది. ఒక్క ఫోన్ చేస్తే చాలు మీ అవసరాలు తీర్చేలా ప్రైవేట్ చార్టర్ ను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. 'మీ అవసరం ఎంత పెద్దది అయినా..చిన్నది అయినా మా సమాధానం..మేం చేస్తాం' అన్నదే అంటూ స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది.

45 నుంచి 90 మందికి సరిపడేలా క్యూ400 విమానాలతోపాటు..125 నుంచి 200 మందికి సరిపోయేలా బోయింగ్ 737 విమానాలు కూడా తాము సరఫరా చేస్తామని స్పైస్ జెట్ అంటోంది. 200 నుంచి 350 ప్రయాణికులతో దూర ప్రాంతాలకు వెళ్లేలా వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ లు కూడా రెడీగా ఉన్నట్లు తెలిపింది. ఒకప్పుడు పెళ్లిళ్లకు బస్ లు..కార్లు మాత్రమే అద్దెలకు ఉండేవి. ఇప్పుడు ఏకంగా విమానాలు కూడా పెళ్లిళ్ళకు అద్దెకు ఇవ్వటానికి వచ్చేశాయి. కాకపోతే అంత మొత్తం చెల్లించేందుకు డబ్బు ఉంటే చాలు.

Similar Posts

Recent Posts

International

Share it