స్పైస్ జెట్ నుంచి కొత్తగా 21 సర్వీసులు

స్పైస్ జెట్ నుంచి కొత్తగా  21 సర్వీసులు

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్ స్పైస్ జెట్ కొత్తగా 21 కొత్త దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభిస్తోంది. జనవరి 12 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. అందులో హైదరాబాద్-విజయవాడ మధ్య రెండు సర్వీసులు ఉన్నాయి. దీంతోపాటు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతిలకు కూడా కొత్త సర్వీసులు ప్రారంభిస్తోంది.

దేశీయంగా పలు రూట్లలో కనెక్టివిటి పెంచటంతోపాటు కొత్తగా ముంబయ్ నుంచి రస్ అల్ ఖైమాకు కూడా సర్వీసులు ప్రారంభించనుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి రస్ అల్ ఖైమాకు సర్వీసులు ప్రారంభించింది స్పైస్ జెట్. ముంబయ్, బెంగుళూరుల నుంచి ఒడిశాలోని జరూస్ గూడకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్న తొలి సంస్థగా స్పైస్ జెట్ నిలుస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Similar Posts

Recent Posts

International

Share it