స్పైస్ జెట్ ..899 రూపాయలకే దేశీయ విమాన టిక్కెట్లు

స్పైస్ జెట్ ..899 రూపాయలకే దేశీయ విమాన టిక్కెట్లు

దేశంలోని ప్రముఖ చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. దేశీయ విమానయాన రంగం దగ్గరదగ్గరగా కోవిడ్ ముందు నాటి పరిస్థితికి రావటంతో ఎయిర్ లైన్స్ ఆఫర్లు మళ్ళీ మొదలయ్యాయి. తాజాగా స్పైస్ జెట్ దేశీయ రూట్లలో 899 రూపాయలకే టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. జీరో క్యాన్సిలేషన్ ఫీజుతో ఈ టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ టిక్కెట్ల విక్రయం జనవరి 13న ప్రారంభం అయి...17 వరకూ కొనసాగనుంది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపారు.

'ట్రిపుల్ బొనాంజా సేల్' పేరుతో స్పైస్ జెట్ ఈ ఆఫర్ ప్రకటించింది. గతంలోనూ విమానయాన సంస్థల మధ్య ఈ ఆఫర్ల యుద్ధం నడిచేది. కోవిడ్ తో ఈ రంగం తీవ్ర నష్టాల పాలు అయింది. అయితే తాజాగా దేశీయ విమాన సర్వీసులు 80 శాతం మేర ప్రారంభం అయ్యాయి. అందులోనూ ఆక్యుపెన్సీ రేషియా చాలా రూట్లలో ప్రోత్సాహకరంగానే ఉంది. త్వరలోనే కోవిడ్ ముందు నాటి స్థాయిలో విమాన సర్వీసులకు అనుమతించే దిశగా కేంద్ర పౌరవిమానయాన శాఖ సన్నాహాలు చేస్తోంది.

Similar Posts

Recent Posts

International

Share it