స్పైస్ జెట్ సీ ప్లేన్ సర్వీసులు డిసెంబర్ 27 నుంచి

స్పైస్ జెట్ సీ ప్లేన్ సర్వీసులు డిసెంబర్ 27 నుంచి

స్పైస్ జెట్ కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ స్పైస్ షటిల్ డిసెంబర్ 27 నుంచి సీప్లేన్ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరకూ ఈ సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రూటులో ప్రతి రోజూ రెండు సర్వీసులు నడపనున్నారు. ఈ స్లీ ప్లేన్ సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు స్పైస్ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది.

కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఈ సర్వీసులను నిలిపివేశారు. అయితే ఇప్పుడు సమస్యలను పరిష్కరించి తిరిగి సర్వీసులను ప్రారంభించటానికి రెడీ అయింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. స్పైస్ జెట్ ప్రారంభించిన ఈ సీప్లేన్ సర్వీసులకు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించింది.

Similar Posts

Recent Posts

International

Share it