ఇండిగో బాటలోనే స్పైస్ జెట్

ఇండిగో బాటలోనే స్పైస్ జెట్

దేశంలోని ప్రముఖ చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా విమానాశ్రయంలోని కౌంటర్లలో చెక్ ఇన్ అయితే వంద రూపాయలు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇండిగో ఈ నిర్ణయం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వెబ్ చెక్ ఇన్ ను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

విమానాశ్రయాల్లో టచ్ పాయింట్లను నిరోధించేందుకు మేలోనే ప్రయాణికులు అందరూ వెబ్ చెక్ ఇన్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. స్పైస్ జెట్ మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా ప్రయాణికులు వెబ్ చెక్ ఇన్ కావొచ్చని తెలిపారు.

Similar Posts

Share it