స్టాట్యూ ఆఫ్ లిబర్టీని దాటేసిన స్టాట్యూ ఆప్ యూనిటీ

స్టాట్యూ ఆఫ్ లిబర్టీని దాటేసిన స్టాట్యూ ఆప్ యూనిటీ

సందర్శకులను ఆకర్షించటంలో గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అమెరికాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీని అధిగమించింది. గుజరాత్ సందర్శించే ప్రతి ఒక్కరూ స్టాట్యూ ఆఫ్ యూనిటీని చూడకుండా రావటం లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పర్యాటకులు. స్టాట్యూ ఆప్ లిబర్టీని గత నెలలో పది వేల మంది సందర్శించగా..అదే గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటిని 13 వేల మంది సందర్శించుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పిన ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాం ఫ్యామిలీ హాలిడే కేంద్రంగా మారిందని గుజరాత్ అధికారులు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్రమోడీ సబర్మది నది నుంచి స్లీ ప్లేన్ సర్వీసులను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. సబర్మతి నుంచి మొదలయ్యే సీ ప్లేన్ సర్వీసులు స్టాట్యూ ఆఫ్ యూనిటీని చూపించి మళ్లీ తిరిగి వచ్చి సబర్మతి నదిలోనే ల్యాండ్ కానున్నాయి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద పర్యాటకులను ఆకట్టుకనేందు ఎన్నో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది.

Similar Posts

Recent Posts

International

Share it