తాజ్ మహల్ కు ఇప్పుడు 15 వేల మంది వెళ్లొచ్చు

తాజ్ మహల్ కు ఇప్పుడు 15 వేల మంది వెళ్లొచ్చు

తాజ్ మహల్. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈ పాలరాతి కట్టడాన్ని ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కరోనా కారణంగా అన్ని చోట్లా ఇప్పుడు ఆంక్షలే. తాజ్ మహల్ దగ్గరా అదే పరిస్థితి. ప్రస్తుతం రోజుకు అక్కడ ఐదు వేల మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తున్నారు.

ఇప్పుడు ఆ సంఖ్యను 15 వేల కు పెంచారు. ఈ మేరకు ఆగ్రా జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజ్ మ హల్ కు వచ్చే సందర్శకుల సంఖ్యను 15 వేలకు , ఆగ్రా ఫోర్టుకు వచ్చే పర్యాటకుల సంఖ్యను 7500కు పెంచారు. సెప్టెంబర్ 21 నుంచి ఇక్కడకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఇప్పుడు పర్యాటకుల సంఖ్య పరిమితిని పెంచారు.

Similar Posts

Recent Posts

International

Share it