ఉత్తరాఖండ్ లో తెహ్రి లేక్ ఫెస్టివల్

ఉత్తరాఖండ్ లో తెహ్రి లేక్ ఫెస్టివల్

ఉత్తరాఖండ్ సందర్శనకు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఆ రాష్ట్ర సర్కారు ఇఫ్పుడు 'తెహ్రి లేక్ ఫెస్టివల్'కు రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో ఇది జరగనుంది. చూపరులను విశేషంగా ఆకట్టుకునే ఈ సుందర ప్రాంతంలో నిర్వహించే ఉత్సవం పర్యాటకులకు కనువిందు చేయనుంది. ప్రతి ఏటా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తెహ్రి లేక్ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

అయితే ఈ ఉత్సవంలో పాల్గొనాలనుకునే వారు తమ సీట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే కళ్ళు మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్స్ తోపాటు అడ్వెంచర్ కార్యక్రమాలు, మ్యూజిక్ , సాంస్కృతిక కార్యక్రమాలకు తోడు మరెన్నో ఆకర్షణలు ఇక్కడ ఉంటాయి. విమానంలో వెళ్లే ప్రయాణికులు డెహ్రడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ లో దిగి ఈ ఉత్సవం జరిగే వేదికకు వెళ్లొచ్చు.

Similar Posts

Recent Posts

International

Share it