థాయ్ ల్యాండ్ ప్రత్యేక వీసా నిబంధనల్లో మార్పులు

థాయ్ ల్యాండ్ ప్రత్యేక వీసా నిబంధనల్లో మార్పులు

థాయ్ ల్యాండ్ తన ప్రత్యేక పర్యాటక వీసా (ఎస్ టీవీ) విధానంలో మార్పులు చేసింది. తొలుత కోవిడ్ తక్కువ రిస్క్ ఉన్న దేశాల నుంచి మాత్రమే పర్యాటకులను అనుమతిస్తామని ప్రకటించింది. ఈ వీసా నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది మాత్రమే థాయ్ ల్యాండ్ దేశంలోకి ప్రవేశించారు. దీంతో తాజాగా కేసులతో సంబంధం లేకుండా ఏ దేశం వాళ్ళు అయినా థాయ్ ల్యాండ్ రావొచ్చంటూ మార్పులు చేసింది. అయితే ప్రతి ఒక్కరూ 14 రోజుల క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. అంతే కాదు..స్పెషల్ టూరిస్ట్ వీసా (ఎస్ టీవీ) కింద దేశంలో 60 రోజుల నివాసం ఉండటానికి సిద్ధపడాలి.

అంతే కాదు ఆరోగ్య బీమా కూడా విధిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా వారికి తొమ్మిది నెలల వరకూ ఉండటానికి అనుమతిస్తారు. కరోనాతో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకే థాయ్ ల్యాండ్ ఇప్పుడు ఎస్ టివి స్కీమ్ తో ముందుకొచ్చింది. అయితే అరవై రోజులు ఉండాలనే నిబంధన చాలా మందిని నిరుత్సాహానికి గురి చేసే అంశంగా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినందున రాబోయే రోజుల్లో ఈ ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it