ఆగ‌స్టు 1 వ‌ర‌కూ భార‌త విమానాల‌పై యూఈఏ నిషేధం

ఆగ‌స్టు 1 వ‌ర‌కూ భార‌త విమానాల‌పై యూఈఏ నిషేధం

భార‌త్ నుంచి ప్ర‌తి ఏటా దుబాయ్ కు వెళ్లే ప‌ర్యాటకులు..వ్యాపారుల సంఖ్య కోట్ల‌లోనే ఉంటుంది. దేశంలోని కీల‌క నగ‌రాల నుంచి దుబాయ్ తోపాటు యూఏఈలోని ప‌లు దేశాల‌ను సంద‌ర్శిస్తుంటారు. అయితే క‌రోనా కార‌ణంగా ఇది పూర్తిగా ప‌డ‌కేసింది. మ‌ధ్య‌లో కొన్ని రోజులు విమాన స‌ర్వీసులు ప్రారంభం అయినా..క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా దీనికి మ‌ళ్ళీ బ్రేక్ ప‌డింది. యునైటెడ్ అర‌బ్ ఏమిరేట్స్ (యూఏఈ) తాజాగా మ‌రోసారి భార‌త్ నుంచి విమానాల‌పై నిషేధాన్ని పొడిగించింది. కొత్త‌గా ఇచ్చిన ఆదేశాల మేర‌కు ఆగ‌స్టు 1 వ‌ర‌కూ భార‌త్ నుంచి ఎలాంటి విమానాల‌ను అనుమ‌తించ‌రు. భార‌త్ తో పాటు శ్రీలంక‌, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ల విమానాల‌కు ఈ నిషేధం వర్తించ‌నుంది.

అన్ని ర‌కాల వీసాల‌కు ఇది అమ‌ల్లో ఉండ‌నుంది. యూఏఈ జ‌న‌ర‌ల్ సివిల్ ఏవియేష‌న్ అథారిటీ ఏప్రిల్ 24 నుంచి భార‌త విమానాల‌పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. ఎతిహాద్ ఎయిర్ లైన్స్ అయితే ఇంత‌కు ముందు జులై31 నుంచి అయితే విమానాల‌ను న‌డ‌ప‌నున్నట్లు ప్ర‌క‌టించింది. కొత్త తేదీపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే కొన్ని ఎయిర్ లైన్స్ మాత్రం నాన్ రిఫండ‌బుల్ ప‌ద్ద‌తి ప్ర‌కారం టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తున్నాయి. క‌రోనా రెండ‌వ ద‌శ కార‌ణంగా ప‌లు దేశాలు భార‌త విమానాల‌ను అనుమ‌తించ‌టం లేదు.

Similar Posts

Recent Posts

International

Share it