రామ‌ప్ప ఆల‌యానికి యునెస్కో గుర్తింపు

రామ‌ప్ప ఆల‌యానికి యునెస్కో గుర్తింపు

కాకతీయుల శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. తెలంగాణలో అత్యద్భుత శిల్పసందపకు చిరునామాగా నిలిచిన రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. ఇవాళ చైనాలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణా ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన తొలికట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లా పాలంపేటలోని 800 ఏళ్ల నాటి ఈ కాకతీయ కట్టడం. ఆలయం శిల్పి పేరుతోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. చారిత్ర‌క రామ‌ప్ప ఆల‌యానికి ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు ద‌క్కింది. కాక‌తీయ గ‌ణ‌ప‌తిదేవుడి కాలంలో నిర్మించిన ఈ దేవాల‌యం ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కింది. రేచ‌ర్ల రుద్రుడు ఈ దేవాల‌యాన్ని నిర్మించారు. నీళ్ల‌లో తేలే ఇటుక‌ల‌తో ఈ దేవాల‌య గోపురం నిర్మించారు. దేవాల‌యంలోని క‌ళా నైపుణ్యాల‌ను చౌసి ఔరా అనాల్సిందే. ఆదివారం నాడు ఈ దేవాల‌యానికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వరంగల్‌ రామప్ప ఆలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇంజనీరింగ్‌, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ఇక భారత కట్టడం ఎంత మాత్రం కాదని ప్రపంచ స్థాయి కట్టడమంటూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌.

ఈరోజు చైనాలో జరిగిన యూనెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కట్టబెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌.అధికారికంగా ప్రకటించారు. 2020 ఏడాదికి గాను రామప్పకు ఈ హోదా దక్కింది. 2021 ఏడాది నామినీగా గుజరాత్‌కి చెందిన ధోలవీర ఆలయం వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ బరిలో ఉంది. రామప్పకు వారసత్వ సంపద హోదా రాకుండా నార్వే అడ్డుకునే యత్నం చేయగా, భారత్‌ తరఫున రష్యా వాదించింది. 17 దేశాలు ఆమోదం తెలపడంతో రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పటివరకు ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1,121 కట్టడాలు ఉన్నాయి. వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ గుర్తింపు కోసం మొత్తం మూడు చారిత్రక కట్టడాలు పోటీ పడగా అందులో సాంకేతిక కారణాల వల్ల ఖిలావరంగల్‌, వేయిస్థంభాలగుడిలు తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం ఒక్కటే ఎన్నికైంది.

Similar Posts

Recent Posts

International

Share it