విస్తారా నుంచి కూడా మాన్ సూన్ సేల్

విస్తారా నుంచి కూడా మాన్ సూన్ సేల్

విమాన ప్ర‌యాణికుల‌పై వ‌ర్షాకాల‌ ఆఫ‌ర్లు వెల్లువలా వస్తున్నాయి. ఇప్ప‌టికే చౌక‌ధ‌ర‌ల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ దేశీయ‌ రూట్ల‌లో టిక్కెట్ ను 999 రూపాయ‌ల‌కే ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ లో స‌ర్వీసులు అందిస్తున్న విస్తారా కూడా ఆఫ‌ర్ల‌తో ముందుకొచ్చింది. దేశీయ రూట్ల‌లో ఒక వైపు టిక్కెట్ ధ‌ర‌ను 1099 రూపాయ‌ల‌కే ఇస్తున్న‌ట్లు తెలిపింది. అదే ప్రీమియం ఎకాన‌మీలో అయితే 2099 రూపాయ‌లు, బిజినెస్ క్లాస్ లో 5999 రూపాయ‌ల‌కు టిక్కెట్లు ఆఫ‌ర్ చేస్తోంది. అయితే డిస్కౌంట్ ధ‌ర‌తో పొందే టిక్కెట్ల‌పై 2021 ఆగ‌స్టు 1 నుంచి అక్టోబ‌ర్ 12 మ‌ధ్య ప్ర‌యాణించాల్సి ఉంటుంది. 48 గంట‌ల ఈ ఆఫ‌ర్ జూన్ 25 సాయంత్రానికి ముగియ‌నుంది.

Similar Posts

Recent Posts

International

Share it