లోయర్ మానేరు డ్యాం

లోయర్ మానేరు డ్యాం

కరీంనగర్‌ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో లోయర్ (దిగువ)మానేరు డ్యాం ఒకటి. గోదావరి నదికి ఉప నది అయిన మానేరుపై ఈ డ్యాం నిర్మించారు. ఇది కరీంనగర్ పట్టణానికి జీవనరేఖ వంటిది. ఈ అద్భుతమైన...ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తుంటారు. లోయర్ మానేరుడ్యాం నిర్మాణం 1974 లో ప్రారంభం కాగా..ఇది 1985సంవత్సరంలో పూర్తయింది. ఈ లోయర్ మానేరుడ్యాంలో 20 ఫ్లడ్ గేట్స్ ఉన్నాయి. వర్షాకాలం సమయంలో ఈ డ్యామ్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ డ్యామ్ దగ్గర నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షించటం ఓ అద్బుతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ డ్యామ్ దగ్గర ప్రత్యేక బోటింగ్ సదుపాయం కూడా పర్యాటకులకు అందుబాటులో ఉంది.

హైదరాబాద్ నుంచి 177 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం.

Similar Posts

Recent Posts

International

Share it