మహావీర్ హరిణ వనస్థలి పార్కు

మహావీర్ హరిణ వనస్థలి పార్కు

హైదరాబాద్-–విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ ప్రతిష్టాత్మక పార్కు ఉంది. 3600 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు విస్తరించి ఉంది. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం, దట్టమైన అడవులతో కూడిన చెట్లు ఇక్కడ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. అంతే కాదు నీటితో కళకళలాడే చెరువులు..హంగామా చేసే జింకలు..నెమళ్ళు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మంచి సువాసన వెదజల్లే బర్సారా చెట్లు ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్ ను పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ షికారీ ప్రాంతమైన ఈ దట్టమైన అడవే ప్రస్తుత మహవీర్ హరిణ వనస్థలి. ఇది దేశంలోనే అతి పెద్ద జింకల పార్కుగా గుర్తింపు పొందింది. 1994లో జాతీయ వనంగా గుర్తింపు పొందిన ఈ పార్కులో వందలాది కృష్ణ జింకలు, బంగారు జింకలు, 500 నెమళ్లు, 300 కుందేళ్లు, అడవి పందులు, ముంగిసలు, పాములతో పాటు మొత్తం 200 రకాల పక్షులు..ఔషధ మొక్కలు ఉన్నాయి.

సందర్శనవేళలు: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

సోమవారం సెలవు

Similar Posts

Recent Posts

International

Share it