మల్లెల తీర్థం

మల్లెల తీర్థం

మల్లెలతీర్థం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో కూడి అత్యంత రమణీయంగా కనిపిస్తుంది., ప్రశాంతమైన ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు ఓ కీలక విహార కేంద్రం.హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి మార్గంలో వచ్చే అమ్రాబాద్ మండలంలోని వట్వర్లపల్లి గ్రామం నుండి 9కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెలతీర్థం జలపాతానికి చేరుకోవచ్చు. అచ్చంపేట నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.

హైదరాబాద్ నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it