మైపాడు బీచ్

మైపాడు బీచ్

బంగాళాఖాతం తీరంలో ఉన్న ఒక బీచ్మైపాడు బీచ్. ఇది నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 25 కిలోమీటర్ల (16 మైళ్ల) దూరంలో మైపాడ్‌ ఉన్నది. ఈ బీచ్‌ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. ఈ బీచ్‌ జాలర్లు చేపలు పట్టేందుకు అనువుగా అవకాశాలు అందిస్తుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్స్ వంటి వాటిని అభివృద్ధి చేయటం ద్వారా, వినోద కార్యకలాపాలను ఏర్పాటు చేయటం ద్వారా మైపాడు బీచ్‌ను ప్రోత్సహించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకుంటోంది. పర్యాటకులు ఇక్కడ సముద్రంలో బోటు షికారు చేయడానికి పర్యాటక అభివృద్ధి సంస్థ బైకు వంటి మర బోటును కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వారాంతాల్లో ఈ బీచ్‌లో భారీగా సందడి ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it