నగునూరు

నగునూరు

కరీంనగర్ జిల్లాలోని ఈ గ్రామం ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి కీలక ప్రాంతం. కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు వారి పాలనా కాలాల్లో నగునూరులో ఎన్నో సుందరమైన దేవాలయాలను నిర్మించారు. ఇక్కడ ఉన్న అతి ముఖ్యమైన దేవాలయాల్లో మూడు దేవాలయాల కలయిక అయిన త్రికూట దేవాలయం ముఖ్యమైనది. ఈ ఆలయం మృదంగం ఇతర సంగీత వాయిద్యాలను వాయిస్తున్న కళాకారుల చిత్రాలతో ఆసక్తికరమైన శిల్పాలను కలిగి ఉంది. నృత్యకారుల భంగిమలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ గ్రామంలో ఒకప్పుడు నాలుగు వందల ఆలయాలు ఉండేవని అందుకని నన్నూరు అని పేరు వచ్చిందని ఒక కథనం. అలాగే ఊరికి పూర్వం నగరూరు అని పేరు ఉండేది. అయితే అది కాలక్రమంలో నగునూరైందని మరో కథనం ప్రచారంలో ఉంది.

ఈ గ్రామంలో ప్రాచీన కోట, గ్రామం చుట్టూ ఉన్న ప్రాకారపు గోడలను నేటికీ చూడవచ్చు. 1170లో కాకతీయ రుద్రుడు వారిని అంతమొందించి, తన మంత్రికి అయిన గంగరాజును పాలకునిగా నియమించాడు. ఇక్కడ నేటికీ రామప్పగుడి శిల్పంతో సాటియైన శిల్పకళా సౌందర్యం వివరించే దేవాలయం, చిత్రవిచిత్ర కళా నైపుణ్యం గల స్తంభాలు ఉన్నాయి. జైనమత ఛాయలు కనిపిస్తాయి. కాకతీయ రుద్రుని పాలనలో గంగాధరుడు నిర్మించిన త్రికూటాలయం అటువంటిదే.నగునూరు కరీంనగర్‌కు 8 కి.మీ.దూరంలో ఉంటుంది.

హైదరాబాద్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Share it