నెహ్రూ జూలాజికల్ పార్కు

నెహ్రూ జూలాజికల్ పార్కు

ప్రకృతి ప్రేమికులకు... జంతు ప్రేమికులకు ఇది ఓ ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. నగరంలోని మీర్ ఆలం ట్యాంక్‌కి సమీపంలో ఉన్న ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంతో పేరుగాంచిన పర్యాటక ఆకర్షణ కేంద్రం. 1959లో ఏర్పాటయిన ఈ పార్క్ ప్రజలకి 1963లో అందుబాటులోకి వచ్చింది. వివిధ రకాల జంతువులు,సరీసృపాలు,పక్షులకు ఈ జూ నెలవు. టైగర్లు, పాంథర్లు, ఏషియాటిక్ లయన్స్, పైథాన్లు, కొండచిలువలు,ఒరాంగుటాన్లు, మొసళ్ళు, పక్షులు, ఏంటేలోప్స్, జింకలు, ఇండియన్ రైనో వంటి వివిధ జాతుల జంతువులను ఈ జూలో చూడవచ్చు. ఈ నెహ్రు జంతు ప్రదర్శన శాల మొత్తం 380 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇది 50సంవత్సరాల పురాతనమైనది. భారతదేశంలోనే మొట్టమొదటి సీతాకోక చిలుకల పార్క్, జంగిల్ సఫారీలు ఈ పార్క్ ప్రత్యేకం. అంతరించిపోయిన రాక్షస బల్లుల జాతులకు చెందిన నిలువెత్తు నమూ నాలు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

జంతువులు, పక్షులకి సహజసిద్దమైన నివాసాలని ఏర్పాటు చెయ్యడంలోజాగ్రత్త వహించారు. ఈ జూ సందర్శన వల్ల ఆహ్లాదంతో పాటు విజ్ఞానం కలుగుతుంది. పర్యాటకులు తమ పిల్లలతో ఈ జూని ఎక్కువగా సందర్శిస్తారు. ఏనుగు స్వారీలు, సఫారీలు ఈ జూలో అందుబాటులో ఉంటాయి. ఈ జూ ప్రాంగణంలో నేచురల్ హిస్టరీ మ్యూజియం కూడా ఉంది. నడవలేని పెద్దవాళ్ళ కోసం బ్యాటరీ కార్లను కూడా జూలో అందుబాటులో ఉంచారు.

సందర్శన వేళలు: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ.

(సోమవారం సెలవు)

Similar Posts

Recent Posts

International

Share it