ఎన్టీఆర్ గార్డెన్స్

ఎన్టీఆర్ గార్డెన్స్

నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఎన్టీఆర్ గార్డెన్స్ ఒకటి. నగరం నడిబొడ్డున ఈ గార్డెన్స్ వారాంతాల్లో పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షిస్తుంది. నగర ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా ఎన్టీఆర్ గార్డెన్స్‌ను చూడకుండా వెళ్ళరంటే అతిశయోక్తి కాదు. 36 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంటుంది. 1999 నుంచి ఇది అనేక దశలలో నిర్మితమైంది. సందర్శకులకు నగరం కనిపించేలా ఎత్తెన రొటేటర్‌ టవర్‌ ఈ గార్డెన్స్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో కూర్చున్న వారిని ఒకటిన్నర నిమిషంలో దాదాపు 70 అడుగుల ఎత్తుకు తీసుకు వెళుతుంది.

ఎత్తుకు చేరిన తరువాత 30 సెకెన్ల పాటు చుట్టూ తిరుగుతూ నగర అందాల్ని వీక్షించవచ్చు. మళ్లీ నిమిషమున్నరలో కిందకు చేరుకోవచ్చు. ఎన్టీఆర్ గార్డెన్స్ లోనే బోటింగ్ సదుపాయంతో పాటు వాటర్ ఫౌంటెన్స్, పిల్లలకు పలు గేమ్ జోన్స్, రెస్టారెంట్ వంటి సౌకర్యం ఉన్నాయి. ఇదే ప్రాంతంలో పలు పర్యాటక ప్రాంతాలు ఉండటంతో ఎక్కువ మంది పర్యాటకులు ఖచ్చితంగా ఎన్టీఆర్ గార్డెన్ ను సందర్శిస్తారు.

సందర్శన వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ

Similar Posts

Share it