తాజ్ మహల్..రోజుకు ఐదు వేల మందికే అనుమతి

తాజ్ మహల్..రోజుకు ఐదు వేల మందికే అనుమతి

అగ్రాలో తాజ్ మహల్ సందర్శకులకు మళ్ళీ కనువిందు చేయనుంది. మధ్యలో ఓ సారి ఓపెన్ చేసినా కరోనా కేసుల పెరుగుదలతో మళ్ళీ వెంటమే మూసివేశారు. తిరిగి సోమవారం నాడు తాజ్ మహల్ లో సందర్శకులను అనుమతిస్తున్నారు. అయితే రోజుకు ఐదు వేల మందికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. తాజ్ మహల్ సందర్శించాలనుకునేవారు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 2500 మందికి..మధ్యాహ్నాం రెండు గంటల తర్వాత మిగిలిన వారిని అనుమతించనున్నారు. కఠిన కోవిడ్ నిబంధనల మధ్యే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆప్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు వెల్లడించారు.

Similar Posts

Recent Posts

International

Share it