పానగల్ కోట

పానగల్ కోట

అబ్బురపరిచే కట్టడాలు..శిల్పకళా నైపుణ్యం పానగల్ కోటలో చూడొచ్చు.మత సామరస్యానికి ప్రతీకగా అనేక నిర్మాణాలు ఉన్నాయి అక్కడ.పానగల్‌ కోట వనపర్తి జిల్లా లోని గిరి దుర్గాలలో ప్రముఖమైన చారిత్రక కోట. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ కోటలో, ఈ ప్రాంత ప్రజల మధ్య సామరస్యానికి ప్రతీకగా నిలిచే అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతపు జానపదుల అనేక కథలలోనూ ఈ కోట ప్రస్తావన ఉంది. కోటలోని పరివారానికి నాడు ఆహారం కొరకు రకరకాల పళ్ళ చెట్లు కూడా కోటలో పెంచేవారని సమాచారం. కోటకు వెళ్లడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ..తరచుగా సందర్శకులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. గుప్త నిధుల వేటగాళ్ల బారినపడి ఇక్కడి అపురూపమైన ప్రాచీన సాంస్కృతిక కట్టడాలు నేలమట్టమైపోతున్నాయి. విగ్రహాలు ధ్వంసమైపోతున్నాయి.ఈ ప్రాంతంలో లభించిన అనేక శాసనాలను, ఫిరంగులను జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు.

Similar Posts

Recent Posts

International

Share it