పానగల్

పానగల్

నల్గొండ జిల్లాలో ఉన్న ఈ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న ఒక స్తంభం నీడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ శివలింగం వెనకనే ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. పచ్చల సోమేశ్వర స్వామి, ఛాయ సోమేశ్వరస్వామి దేవాలయాలు పానగల్‌లో వెలిశాయి. 11వ, 12వ శాతాబ్దాల్లో నిర్మించిన ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాకారాలపైన రామాయణ,మహాభారత కథల శిల్పాలు చెక్కి ఉన్నాయి.ఖజురహోలో కన్పించే కొన్ని శృంగార దృశ్యాలు ఇక్కడి ప్రాకారాలపై దర్శనమిస్తాయి. ఇక్కడ నెలకొన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కాంచనపల్లి శింగరాజు నిర్మించినట్టుగా చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. హైదరాబాద్ నుంచి 101 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it