పర్ణశాల

పర్ణశాల

రాముడు తన 14 సంవత్సరాల వనవాస కాలంలో భార్య సీత, సోదరుడు లక్ష్మణుడుతో కలిసి ఈ ప్రదేశంలో కొంత కాలం నివసించాడు. ఇక్కడ రాముడు ఒక గుడిసె నిర్మించాడు. ఈ ప్రదేశానికి సమీపంలో ఒక ప్రవాహం ఉంటుంది. సీతా మాత ఈ ప్రవాహంలో స్నానాలు చేసి తన దుస్తులు శుభ్రపరుచుకున్నదని చెపుతారు. ఇప్పటికీ ఇక్కడ కొన్ని ఆధారాలు చూపుతారు. భద్రాచలం పట్టణం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పర్ణశాలలో రామాయణకాలం నాటి చారిత్రక ఆధారాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. దీన్ని మారీచుడిని వధించిన స్థలంగా పేర్కొంటారు. బంగారు లేడి ఉదంతం జరిగిన ప్రదేశం కూడా ఇదేనని అంటారు. పర్ణశాల నుంచి గోదావరి అందాలను కూడా వీక్షించవచ్చు.

https://www.youtube.com/watch?v=9dmaGzZTi6g

Similar Posts

Recent Posts

International

Share it