దుబాయ్ విమానాశ్రయంలో ‘కోవిడ్ టెస్ట్ లు చేస్తున్న కుక్కలు’

దుబాయ్ విమానాశ్రయంలో ‘కోవిడ్ టెస్ట్ లు చేస్తున్న కుక్కలు’

పోలీసు కుక్కలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అవి బాంబులను కూడా గుర్తిస్తాయి. అంతే కాదు..నేరస్తులను పట్టించటంలో పోలీసు కుక్కల పాత్ర చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. కరోనా బాధితులను కూడా కుక్కలు గుర్తిస్తాయా? అంటే ఔననే చెబుతున్నారు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాహకులు. ఇప్పుడు దుబాయ్ విమానాశ్రయంలో కె9 పోలీసు కుక్కలను కోవిడ్ 19 బాధితులను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే ఎక్కడా ప్రయాణికులు కానీ..కుక్కలు నేరుగా తారసపడే పరిస్థితులు ఉండవు. దీని కోసం కె9 కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు కూడా.

ప్రప్రంచంలో ప్రస్తుతం ఒక్క దుబాయ్ విమానాశ్రయంలో మాత్రమే కుక్కలతో కోవిడ్ పరీక్షలు చేయించుతున్నారు. దీని కోసం విమానాశ్రయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల నుంచి చెమట బిందువులను తీసుకుంటారు. అది కూడా చంకల నుంచి తీసుకుంటారు. ముక్కులో..గొంతు నుంచి శాంపిళ్ళు తీసుకునే దానికంటే ఈ విధానం చాలా సులభంగా ఉంటుంది. ఇలా ప్రయాణికుల నుంచి తీసుకున్న శాంపిళ్లు అన్నింటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో ఉంచి కుక్కలతో పసిగట్టిస్తారు. కుక్కలు ఎక్కడైనా కోవిడ్ బాధితులను గుర్తిస్తే వెంటనే వారికి తదుపరి పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తారు. కోవిడ్ లాక్ డౌన్ తర్వాత దుబాయ్ పర్యాటకులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే.

https://www.youtube.com/watch?v=aCPyDlnsKBY

Similar Posts

Recent Posts

International

Share it