ప్రకాశం బ్యారేజి

ప్రకాశం బ్యారేజి

కృష్ణా..గుంటూరు జిల్లాలను కలుపుతూ నిర్మించిన ప్రకాశం బ్యారెజ్ విజయవాడ నగరానికి ప్రధాన ఆకర్షణ. ఓ వైపు కొండపై కొలువుదీరిన కనకదుర్గమ్మ....కింద కృష్ణా బ్యారేజ్. ఈ బ్యారేజ్ ను 1954వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు శంకుస్థాపన చేశారు. 1957 డిసెంబర్24నాటికి ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జికి ప్రకాశం బ్యారేజ్ అని నామకరణం చేసి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే ప్రకాశం బ్యారేజ్ నే ఓ ప్రముఖ ప్రాంతంగా చూపిస్తారు. అంతటి ప్రాధాన్యత ఉంది ఈ బ్యారేజ్ కు. కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటిని అందించే నీటిపారుదల ప్రాజెక్టు ఈ ప్రకాశం బ్యారేజ్. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి కృష్ణా జిల్లా నాగాయలంక, కోడూరు వద్ద రెండు పాయలుగా బంగాళాఖాతంలో కలిసే కృష్ణానదిపై చిట్టచివరి ఆనకట్టే ప్రకాశం బ్యారేజి. ఏపీ ప్రభుత్వం కొత్తగా కృష్ణా బ్యారేజ్ కు లైటింగ్ ఏర్పాటు చేయడంతో పర్యాటకులకు ఇప్పుడు ఇది ఆకర్షణగా మారింది.

Similar Posts

Recent Posts

International

Share it