పుట్టపర్తి

పుట్టపర్తి

భారత దేశంలోనే కాదు..విదేశాల్లోనూ ‘పుట్టపర్తి’ అంటే తెలియని వారు ఉండరు. దీనికి ప్రధాన కారణం సత్య సాయిబాబా. ఆయన పుట్టిన ప్రాంతం కూడా ఇదే. సాయిబాబా నివాసం ఉండే ప్రాంతాన్నే ‘ప్రశాంతి నిలయం’గా పిలుస్తారు. సత్యసాయిబాబా తనకు వచ్చిన విరాళాలతో ఆ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల ఆదరణ పొందారు. ప్రశాంతి నిలయం అంటే ‘‘మహోన్నత శాంతి యొక్క దామం’’ అని భావిస్తారు చాలామంది భక్తులు. జీవించి ఉన్నప్పుడు సత్యసాయి ఈ ఆశ్రమంలో ప్రతిరోజూ వేలాది మంది తన భక్తులకు దర్శనం ఇచ్చేవారు.సత్యసాయి బాబా ‘‘సాధారణంగా జూన్ మొదలు నుండి మార్చి మధ్య వరకు ప్రశాంతి నిలయంలో ఉండేవారు. ఆయన గతించిన తర్వాత ఇక్కడి సాయి కుల్వంత్ హాల్‌లో సమాధి చేయబడ్డారు. ఈ ప్రాంతానికి వెళ్లిన వారు ఖచ్చితంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయాన్ని సందర్శించకుండా వెళ్ళరు.

అనంతపురానికి 79 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Share it