ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుతం

కంగారు చిత్రాన్ని గీసిన క్వాంటాస్ 747 విమానం

విమానం ఆకాశంలో ఓ చిత్రం గీస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా అంటూ క్వాంటాస్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 747 విమానం చేసిన అద్భుతం ఇది. క్వాంటాస్ ఎయిర్ లైన్స్ లోగో అయిన కంగారు చిత్రాన్ని ఈ బోయింగ్ 747 ఆకాశంలో గీసింది. ఈ చివరి 747 బోయింగ్ విమానం సిడ్ని విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లింది. 50 ఏళ్ళ క్వాంటాస్ చరిత్రలో 747 బోయింగ్ విమానాలు ఏకంగా 250 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. బ్రిటీష్ ఎయిర్ వేస్ కూడా ఇటీవలే తమ దగ్గర ఉన్న బోయింగ్ 747 విమానాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

పైలట్లు, ఇంజనీర్లతోపాటు విమాన సిబ్బంది అంతా ఇందులో పని చేయటానికి ఎంతో ఆసక్తిచూపుతారని క్వాంటాస్ ఓ ప్రకటనలో తెలిపింది. క్వాంటాస్ కూడా బోయింగ్ 747 స్థానంలో ఎంతో ఇంథన సామర్ధ్యం గల 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ ఏ 350లను ఉపయోగిస్తోంది. సిడ్ని విమానాశ్రయానికి వచ్చిన ప్రజలు క్వాంటాస్ బోయింగ్ 747కు వీడ్కోలు పలికారు. అంతే కాదు అమెరికాకు బయలుదేరే ముందు దీనికి వాటర్ సెల్యూట్ కూడా చేశారు.

Similar Posts

Recent Posts

International

Share it