కుతుబ్‌షాహి టూంబ్స్‌

కుతుబ్‌షాహి టూంబ్స్‌

హైదరాబాద్‌ను పాలించిన కుతుబ్ షాహీ రాజుల ఏడు సమాధులు నగరంలోని ఇబ్రహీంబాగ్ లో ఉన్నాయి. ఈ టూంబ్స్ చుట్టూ అందమైన పచ్చిక మైదానాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు అన్నీ హిందూ..పర్షియన్ పద్దతుల్లో ఉంటాయి. చిన్న సమాధుల వరుసలు ఒక అంతస్తులో ఉండగా పెద్ద సమాధులు రెండు అంతస్తుల్లో ఉన్నాయి. ఒక్కొక్క సమాధి మధ్యభాగంలో శవపేటిక దానికింద నేలమాళిగ ఉంటాయి.సమాధిపై గోపురం మీద నీలి, ఆకుపచ్చని టైల్స్ అలంకరించి ఉంటాయి. కుతుబ్ షాహి కాలంలో ఈ సమాధులు గొప్పగా ఆరాధించబడ్డాయి. వారి పాలన తరువాత సమాధులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. 19వ శతాబ్దంలో మూడవ సాలార్ జంగ్ సమాధులను పునరుద్ధరించాలని ఆదేశించాడు. తరువాత సమాధుల చుట్టూ పూదోట ఏర్పాటు చేసి దానిచుట్టూ గోడ నిర్మించారు. దాంతో తిరిగి కుతుబ్ షాహి సమాధుల ప్రదేశం సుందర పర్యాటక ప్రాంతంగా మారింది. చివరి కుతుబ్ షాహి మినహా కుతుబ్ షాహి వంశ కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ సమాధి చేశారు.

సందర్శన: వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

Similar Posts

Recent Posts

International

Share it