సెప్టెంబర్ 30 వరకూ రెగ్యులర్ రైళ్ళు రద్దు

సెప్టెంబర్ 30 వరకూ రెగ్యులర్ రైళ్ళు రద్దు

రైల్వే శాఖ మరోసారి సర్వీసుల రద్దును పొడిగించింది. గత కొన్ని నెలలుగా ఎప్పటికప్పుడు రైల్వే సర్వీసుల రద్దును పొడిగిస్తూ పోతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుముఖం నమోదు కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంటోంది. ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ మెయిల్, ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, సబర్భన్ రైల్వే సర్వీసులను రద్దు చేస్తూ గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ గడువును సెప్టెంబర్ 30 వరకూ పొడిగించారు. అయితే ప్రత్యేక మెయిల్, ఎక్స్ ప్రెస్ సర్వీసులు మాత్రం యథాతధంగా కొనసాగనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది.

Similar Posts

Share it