రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీ

పర్యాటకులకు ఇది వన్ స్టాప్ షాప్ లాంటిది. ఒక్కసారి అందులోకి ప్రవేశిస్తే ఎన్నో అనుభూతులు పొందొచ్చు. అంతేకాదు..పర్యాటకులే కాకండా సినీ పరిశ్రమకు సంబంధించి కూడా అంతే. నటీనటులతో ఫిలిం సిటిలోకి వచ్చి పూర్తి సినిమాతో బయటికి వెళ్లిపోవచ్చు. ఇందులో ఒక్కటేమిటి ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. ఎంత భారీ సెట్టింగ్ లు అయినా ఇందులో వేసుకోవచ్చు. ప్రతిష్ఠాత్మక బాహుబలి సినిమాను కూడా ఇక్కడే తెరకెక్కించారు. రామోజీ పిల్మ్ సిటి మొత్తం 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం (ఫిల్మ్ సిటీ)గా పేరుగాంచింది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు

1996లో స్థాపించిన ఈ ఫిల్మ్ సిటీ పర్యాటక ప్రదేశంగానూ పేరుగాంచింది. ఫిల్మ్ సిటీలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల రంగస్థలాలు ఉన్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత, నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి. వేసవి సెలవులతో పాటు దసరా సెలవుల్లోనూ పిల్లలు..పెద్దల కోసం ఫిల్మ్ సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.

Similar Posts

Recent Posts

International

Share it