గోవా బీచ్ లో రష్యా యువతీ, యువకుల పార్టీ..అరెస్ట్

గోవా బీచ్ లో  రష్యా యువతీ, యువకుల పార్టీ..అరెస్ట్

ఓ వైపు లాక్ డౌన్. అక్కడ పర్యాటకులకు ఎలాంటి అనుమతి లేదు. కానీ రష్యాకు చెందిన ఓ యువతీ, యువకుల బృందం మద్యంతో పార్టీ చేసుకుంది. ఉత్తర గోవాలోని అశ్వెమ్ బీచ్ లో ఎవరూ లేని ప్రదేశంలో వీళ్ళు పార్టీ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కొంత మంది మైనర్లు కూడా ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించటంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించారనే కారణంతో వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని రష్యన్ కాన్సులేట్ కు కూడా తెలియజేశారు.

కొద్ది రోజుల క్రితం గోవా అంతా గ్రీన్ జోన్ గా ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. ఓ వైపు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కొత్త కేసులు వెలుగుచూడటం గోవా ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టిందనే చెప్పాలి. గోవాకు వచ్చే ఆదాయంలో పర్యాటకుల ద్వారా వచ్చే మొత్తం అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే.

Similar Posts

Recent Posts

International

Share it