సంజీవయ్య పార్కు

సంజీవయ్య పార్కు

హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు నెలకొన్న ప్రాంతంలోనే ఈ సంజీవయ్య పార్కు కూడా ఉంది.హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డుకు అతి చేరువులో ఈ పార్కు ఉంటుంది. ఈ పార్కు మొత్తం 92 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఈ పార్కు మరో ప్రత్యేకతను సాధించింది. ఇక్కడే తెలంగాణ సర్కారు అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసింది. ఇది నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నది. పర్యాటకులు కూడా ఈ ప్రాంతం సందర్శనకు ప్రాధాన్యత ఇస్తారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును ఈ ఉద్యానవనానికి పెట్టారు. 2010 సంవత్సరంలో భారతీయ కళా సంస్కృతి వారసత్వ ట్రస్ట్ నుంచి ‘బెస్ట్ ఓపెన్ ల్యాండ్ స్కేప్’ అవార్డు దక్కించుకుంది. పచ్చటి వాతావరణం... పార్కులో ఉండే రకరకాల పూల చెట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సందర్శన వేళలు: ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకూ

Similar Posts

Recent Posts

International

Share it