సతీష్ ధావన్ షార్ సెంటర్

సతీష్ ధావన్ షార్ సెంటర్

దేశానికే ప్రతిష్ఠాత్మకమైన రాకెట్ ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేటకు సమీపంలో శ్రీహరి కోటలో ఉంది. ఈ రాకెట్ ప్రయోగానికి అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ కేంద్రంతోనే ఉపగ్రహ ప్రయోగాలలో దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సూళ్ళూరుపేటకు తూర్పున పులికాట్ సరస్సు, బంగాళాఖాతం మధ్యలో చిట్టడవిలాంటి ద్వీపం శ్రీహరికోట ఉంటుంది. గతంలో ఇక్కడ కొంతమంది నివాసం ఉండేవారు. దీన్ని రాకెట్ ప్రయోగ కేంద్రంగా మార్చటంతో వారిని అక్కడ నుంచి తరలించారు. 1968లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సారాభాయ్ నేతృత్వంలో శ్రీహరికోటలో ఈ కేంద్రం ఏర్పాటైంది. దేశం సాంకేతికంగా..పలు రంగాల్లో పురోగమించటానికి ఈ కేంద్రమే ప్రధాన క్షేత్రం కావటం విశేషం.

Similar Posts

Recent Posts

International

Share it