షామీర్‌పేట లేక్

షామీర్‌పేట లేక్

హైదరాబాద్ శివారు ప్రాంతమైన షామీర్ పేట్ సికింద్రాబాద్‌కి 20కిలోమీటర్ల దూరంలో ఉంది. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని- హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, జీనోమ్ వాలీ వంటి ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థలతో నిండి ఉన్న ప్రదేశం ఈ షామీర్ పేట్. ప్రఖ్యాతిగాంచిన షామీర్‌పేట్‌ చెరువు కూడా ఇక్కడే ఉంది.నిజాములు నిర్మించిన మరొక మానవ నిర్మిత చెరువు ఇది. స్థానిక పర్యటనకు ఇది ఒక ముఖ్య ప్రదేశం. వారాంత విశ్రాంతికి ఇక్కడ ఎన్నో రెస్టారెంట్లు, హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఒక క్లబ్బు, విలాసవంతమైన రిసార్ట్ కూడా ఉన్నాయి. షామీర్ పేట్ లో ఉన్న జింకల పార్కులో జింకలే కాకుండా నెమళ్లు మొదలగు అనేక రకాల పక్షులు కూడా కనిపిస్తాయి. ఈ పార్క్ షామీర్ పేట చెరువుకి అతి సమీపంలో ఉంది. ఎన్నో తెలుగు సినిమాలు ఈ చెరువు చుట్టూ పక్కల ప్రదేశాలలో నిర్మితమైనాయి.

Similar Posts

Recent Posts

International

Share it