అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభానికి చిక్కులెన్నో

అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభానికి చిక్కులెన్నో

భారత్ నుంచి తొలి సర్వీసులు దుబాయ్ కే!

భారత్ లో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించినంత తేలిగ్గా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించటం సాధ్యం కాదు. ఎందుకంటే ఏ దేశానికి సర్వీసులు నడపాలన్నా ముందు ఆ దేశం అనుమతి ఇవ్వాల్సిందే. పలు దేశాలు కరోనా కేసులను బట్టే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే కరోనా కేసుల విషయంలో నాల్గవ స్థానానికి చేరింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇఛ్చేందుకు ఆయా దేశాలు ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుంటాయి. అయితే భారత్ ప్రస్తుతం జులై 15 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అందులోనే ఓ కీలక ప్రకటన చేసింది. ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ షెడ్యూల్ విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అది కేస్ బై కేస్ ఉంటుందని తెలిపారు. ఈ లెక్కన భారత్ నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసులు దుబాయ్ కే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

దీనికి కారణం జులై 7 నుంచి దుబాయ్ పర్యాటకులకు అనుమతి ఇఛ్చిన విషయం తెలిసిందే. విదేశీ పర్యాటకులకు అనుమతి అంటే విమాన సర్వీసులకు కూడా అనుమతి ఇఛ్చినట్లే అని భావిస్తున్నారు. విమాన సర్వీసులకు అనుమతి ఇస్తేనే పర్యాటకులు రాగలుగుతారు. దీంతో తొలి విమాన సర్వీసులు దుబాయ్ కు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా దేశాలు విమానాలకు అనుమతి మంజూరు చేస్తేనే సర్వీసులు ప్రారంభం సాధ్యం అవుతుంది. గతంలో లాగా అంతర్జాతీయ సర్వీసులు అంటే అన్ని దేశాలకు ఓకేసారి ప్రారంభించటం ఈ సారి సాధ్యంకాకపోవచ్చు.

Similar Posts

Recent Posts

International

Share it