ఆర్మూర్ సిద్దుల గుట్ట

ఆర్మూర్ సిద్దుల గుట్ట

ఆర్మూర్ పట్టణంలో ఈ నవసిద్దుల గుట్ట ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నవనాథ సిద్దేశ్వరులు గోరఖ్ నాథ్, జలంధర్ నాధ్, చరపట్ నాథ్,అపభంగనాథ్, కాన్షీనాథ్, మశ్చీంద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్,బర్తరీనాథ్‌లు దేశవ్యాప్త సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చారని చెబుతారు.ఇక్కడి వాతావరణానికి ముగ్దులై ఇక్కడే గుట్టపై తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రాచుర్యంలో ఉంది. ఏటా శివరాత్రి, శ్రీరామనవమి, కార్తీక పౌర్ణమి, ఉగాది పండుగల సమయంలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.గుట్ట మీద గుహలో శివాలయం ఉంది. ఘాట్ రోడ్డులో నవనాథ సిద్దుల విగ్రహాలు, గుట్టపై శివాలయం, రామాలయం, పురాతన ఏకశిలాస్తంభం,పాలగుండం, నీళ్లగుండం ఉన్నాయి. గుట్ట చివరన పాతాళగంగ నిరంతరం పారుతూనే ఉంటుంది. గుట్టపై నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ను వీక్షించవచ్చు. ఇది నిజామాబాద్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Share it