రఘునాథాలయం

రఘునాథాలయం

నిజామాబాద్ పక్కనే ఉన్న ఓ కొండపై ఇందూరు కోటలో ఈ రఘనాథాలయం ఉంది. కోటలోకి ప్రవేశించటానికి చాలా ఎత్తులో ప్రవేశ ద్వారం ఉంటుంది. ఈ ద్వారానికి పై భాగంలో రెండు సింహాల మధ్యన గజలక్ష్మి విగ్రహం చెక్కారు. విగ్రహం కింద భాగాన పద్మం ఉంటుంది.ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు ఇక్కడ సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించాడు. ఈ కోటను గతంలో జైలుగా ఉపయోగించేవారు. ఇదే ఈ కోటకు సింహద్వారం. విశాలమైన మంటపంతో ఆలయం నిర్మించారు. గర్భగుడిలో సీతా రామలక్ష్మణ విగ్రహాలు ఉంటాయి. ప్రాచీన విగ్రహాలను శిర్నాపల్లి సంస్థాన మహారాణి ఇందల్ వాయి రామాలయానికి తరలించారని చెబుతారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాలు కొత్తగా ఏర్పాటు చేసినవి. కోటలో దశావతారాలు చెక్కిన ఏకశిల ఉంది. ఆలయంలో ఉన్న కోనేరును ఉద్యానవనంగా తీర్చిదిద్దారు.

Similar Posts

Share it