శ్రీకూర్మం

శ్రీకూర్మం

శ్రీకూర్మం గ్రామంలో ‘‘కూర్మనాధ స్వామి’’ మందిరం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మా వతార రూపంలో ఇక్కడ పూజలందుకున్నాడు. దేశంలో ఈ తరహాలో ఉన్న కూర్మావతార మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖంగా ఉంటాడు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండుధ్వజ స్తంభాలు ఉంటాయి. 11వ శతాబ్దం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ మధ్యాచార్యులు, వరదరాజస్వామి, కోదండరామస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. గార మండలంలో ఉన్న ఆలయం 2వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలామంది నమ్ముతారు. ఈ ఆలయాన్ని చోళ, కళింగ రాజుల హయాంలో అభివృద్ధి చేశారు. దేవాలయం మొత్తం నిర్మాణంలో ‘గాంధర్వ శిల్ప సంపద’ అని పిలిచే స్తంభాలు ఈ రాజవంశాల పేరు, కీర్తిని చాటి చెబుతాయి. గంగరాజ రాజవంశం వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల పైభాగాన్ని నిర్మించాడు.

దక్షిణ సముద్ర తీరాన శ్వేతపురమనే పట్టణాన్ని శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాడు ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చాడు. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, ‘స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించాలని వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోవాలని ప్రార్థించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీమన్నాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేశాడట. ఆ గంగ మహా ఉదృతంగా రాజువైపు రాగా ఆయన భయంతో పరుగిడి ఒక పర్వతం మీదకు చేరి తన మంత్రిని విషయం అడుగగా, అతను రాజుకు విషయమంతా వివరించాడు.

శ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం దేవాలయం ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it