తారామతి బారాదరి

తారామతి బారాదరి

మూసీ నది ఒడ్డున ఉన్న సుందర ప్రదేశమే తారామతి బారాదరి. గోల్కొండ ఏడవ సుల్తాన్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా నిర్మించిన సారాయ్ ఈ తారామతి బారాదరి. ఇబ్రహీం కులి కుతుబ్ షా నిర్మించిన ఇబ్రహీం బాగ్ అనే ఉద్యానవనం ప్రాంగణంలోనే ఈ సారాయ్ నిర్మించారు. ఈ ప్రాంతానికి వచ్చే ప్రయాణికులకి విశ్రాంతి ప్రదేశంగా మూసీ నది ఒడ్డున ఈ బారాదరిని నిర్మించారు. వేశ్య అయిన తారామతి అలాగే ఆమె చెల్లెలు ప్రేమమతిలకి గౌరవార్ధంగా ఈ బారాదరిని నిర్మించారని గాథలు ఉన్నాయి.

అబ్దుల్లా కుతుబ్ షా సభలో ఆట పాటలతో ఈ అక్కా చెల్లెళ్ళు సందడి చేసేవారు. వారి ప్రదర్శనలకి ముగ్దుడైన సుల్తాన్ వారి కోసం ప్రత్యేకంగా ఒక సారాయ్ ని నిర్మించి తారామతి పేరునే పెట్టారు. అలా ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రాజ సభలో ప్రాముఖ్యత పొందారు. కుతుబ్ షా సుల్తాన్‌, రాణుల సమాధి పక్కనే వీరి సమాధిని కూడా గమనించవచ్చు. దేశీయ నిర్మాణ పద్దతులను ఉపయోగించే ఈ నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ రెస్టారెంట్‌తో పాటు విశాలమైన సమావేశ మందిరాలు ఉన్నాయి.

సందర్శన వేళలు: ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకూ

Similar Posts

Recent Posts

International

Share it