తేలినీలాపురం... విదేశీ పక్షుల విడిదిక్షేత్రం

తేలినీలాపురం... విదేశీ పక్షుల విడిదిక్షేత్రం

సైబీరియా పక్షులను చూడాలంటే తేలినీలాపురం వెళ్లాల్సిందే. పెలికాన్,ఫెయింటెడ్ స్టార్క్స్ జాతిపక్షులు ఇక్కడకు చేరుకుంటాయి. అవీ 12 వేల మైళ్ళు దాటి మరీ ఈ ప్రాంతానికి వస్తాయి. ఈ విదేశీ పక్షులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇక్కడకు వచ్చి పిండోత్పత్తి జరుపుకొని పిల్లలు పెద్దయ్యాక ఏప్రిల్ నెలలో తిరిగిస్వస్థలానికి వెళ్లిపోతాయని చెబుతారు. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే పర్యాటకులు ఒకింత చెమటోడ్చాల్సిందే. ఎందుకంటే అక్కడకు ప్రస్తుతం ఎలాంటి బస్సు సౌకర్యం లేదు.

రవాణా మార్గం: టెక్కలి నుంచి ప్రత్యేక ఆటోల ద్వారా వెళ్ళొచ్చు.

శ్రీకాకుళానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it