పర్యాటక పన్ను దిశగా బ్యాంకాక్ యోచన

పర్యాటక పన్ను దిశగా బ్యాంకాక్ యోచన

బ్యాంకాక్. ప్రతి ఏటా భారత్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు వెళ్ళే ప్రదేశం. థాయ్ లాండ్ లోని బ్యాంకాక్, పుకెట్, పట్టాయా లాంటి ప్రదేశాలను పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శిస్తారు. కరోనా దెబ్బకు అన్ని దేశాల తరహాలోనే థాయ్ లాండ్ కూడా చిక్కుల్లో పడింది. త్వరలోనే పర్యాటకానికి గేట్లు తెరిచిన తర్వాత ఒక్కో విదేశీ పర్యాటకుడి నుంచి 300 థాయ్ బాత్ లకు తక్కువ కాకుండా పన్ను విధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో మహమ్మారి కరోనా వైరస్ బీమా కూడా కవర్ చేయనున్నారు. దేశంలోకి విమానం లేదా సముద్రమార్గం ఎలా వచ్చినా ఒకేసారి ఈ మొత్తాన్ని వసూలు చేయనున్నట్లు థాయ్ ల్యాండ్ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి పిపట్ తెలిపారు. జాతీయ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావటానికి ఇది అవసరం అవుతుందని తెలిపారు.

అయితే ఈ పన్ను విమాన టిక్కెట్లలోనే భాగంగా చేయాలా? లేక ఎలా వసూలు చేయాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కరోనా దెబ్బకు ప్రస్తుతం పర్యాటకుల విశ్వాసం దారుణంగా దెబ్బతిన్నది. ఒక్కో పర్యాటకుడిపై ఎంత భారం మోపాలనే అంశంపై అధ్యయనం చేసే బాధ్యతను ఓ యూనివర్శిటీకి అప్పగించారు. ఈ ఏడాది టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్ లాండ్ దేశంలోకి 16 మిలియన్ల పర్యాటకలను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మారిన పరిస్థితుల్లో ఇది సాధ్యం అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో మాత్రమే పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారని అంచనా వేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=xOf3FyJhTNI

Similar Posts

Recent Posts

International

Share it