పర్యాటకులకు విమాన..హోటల్ గదుల్లో రాయితీలు

పర్యాటకులకు విమాన..హోటల్ గదుల్లో రాయితీలు

పర్యటనలు మీవి..రాయితీలు మావి

పర్యాటక రంగం ఉద్దీపన కోసం ఆ దేశంలో భారీ ఎత్తున రాయితీలు ప్రకటించారు. పర్యటనలు మీవి..రాయితీలు మావి అని ప్రకటించింది ఆ దేశం. కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో పర్యాటకుడికి హోటల్ గది అద్దెలో 40 శాతం ఛార్జీలు ఆ దేశమే చెల్లించనుంది. మిగిలిన అరవై శాతం మొత్తాన్ని పర్యాటకుడు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో రాత్రి అద్దె మొత్తానికి రాయితీగా ఇచ్చే మొత్తాన్ని గరిష్టంగా 3000 బాత్ లకు పరిమితం చేశారు. ఇది ఐదు రాత్రులకు పరిమితం చేశారు.

రూమ్ కు సరఫరా చేసే ఫుడ్ విషయంలో కూడా 600 బాత్ లు రాయితీ కల్పిస్తారు. విమాన ప్రయాణికులకు కూడా ఈ రాయితీలు వర్తింప చేస్తున్నారు. అయితే ఒక్కో ప్రయాణికుడికి 1000 బాత్ లు గరిష్టంగా రాయితీ ఇస్తారు. ముందు ప్రయాణికుడే మొత్తం ధర చెల్లించి కొనుగోలు చేయాలి. ఆ వెంటనే ప్రభుత్వం ప్రతి నెలా 15 వ తేదీన, 30 తేదీన ప్రయాణికులకు రిఫండ్ చేస్తుంది. ‘కలసి ప్రయాణిద్దాం’ పేరుతో థాయ్ ల్యాండ్ సర్కారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ కు ఇఫ్పటికే 35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దేశ గుర్తింపు కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయని తెలిపారు.

Similar Posts

Recent Posts

International

Share it