అంతర్జాతీయ విమాన సర్వీసులు..వ్యాక్సిన్ తో లింక్

అంతర్జాతీయ విమాన సర్వీసులు..వ్యాక్సిన్ తో లింక్

కోవిడ్ కు ముందు ఉన్న తరహాలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో చెప్పటం కష్టం అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కరోనా కేసుల తగ్గుదల..పలు దేశాలు సరిహద్దులను ఓపెన్ చేయటం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఎయిర్ బబుల్ ఒప్పందాలు వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ వరకూ కొనసాగే అవకాశం ఉందని సంకేతాలు ఇఛ్చారు. ఎయిర్ బబుల్ ఒప్పందాల ద్వారా పలు దేశాలు పరస్పరం విమాన సర్వీసులు నడిపేందుకు అనుమతి ఇస్తున్నాయి.

ఈ మేరకు భారత్ పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు అక్టోబర్ 31 వరకూ ఉంది. ఇది మరింత కాలం కొనసాగటం ఖాయం అని మంత్రి స్పష్టమైన సంకేతాలు ఇఛ్చారు. అయితే ప్రస్తుతం 65 శాతం సామర్ధ్యంతో సర్వీసులు నడుపుతున్న దేశీయ విమాన సర్వీసుల పరిమితిని మరింత పెంచేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. దేశీయ విమానయాన రంగం దీపావళి లేదా కొత్త సంవత్సరం నాటికి కోవిడ్ ముందు నాటి పరిస్థితులకు చేరుకోగలదని భావిస్తున్నారు. తెలిపారు.

Similar Posts

Recent Posts

International

Share it